Home తాజా వార్తలు కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కదిలిన మాగం గ్రామ జన ప్రభంజనం

కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కదిలిన మాగం గ్రామ జన ప్రభంజనం

by Telangana Express

(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )21/11/23
ఎన్నికల ప్రచారంలో భాగంగా భైంసా మండలం మాగ0.గడప గడపకు బీజేపీ ప్రచారంలో ఆడబిడ్డలు మంగళ హారతులతో, చిన్న పెద్ద ఆనందం తో చిందులు వేస్తూ, జన నీరాజనం పలికిన కమల దళం.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణ జనాభాలో 50% ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి పదవి.
UPSC తరహాలో TSPSC పరీక్షల నిర్వహణ ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ క్యాలెండర్ విడుదల.
ప్రతి పేదవారికి గ్రామాలలో ఇండ్ల పట్టాలిచ్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇంటిని నిర్మించి ఇస్తాం.
తెలంగాణలోని పేద ప్రజలందరికీ 10 లక్షల రూపాయల కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తాం.
పెట్రోల్ ,డీజిల్ పై వ్యాట్ ను తగ్గించి ధరలు తగ్గిస్తాం.
6.చిన్న సన్నకారు రైతులకు ఎరువులు విత్తనాల కొనుగోలుకు 2500₹రూపాయలు కేటాయిస్తం.
తెలంగాణలో పండించిన వరి ధాన్యం క్వింటాల్కు 3100₹ రూపాయల కనీస మద్దతు ధర తో సేకరిస్తాం.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ప్రతి సంవత్సరం నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం.
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుల పంపిణీ.
భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించి ,కమలం పువ్వు గుర్తుకు ఓట్ వేసి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని మాగం ప్రజలను కోరారు.

You may also like

Leave a Comment