Home తాజా వార్తలు క్రీస్తు చూపిన మార్గం అందరికీ అనుసరణీయం……- రెవరెండ్ డాక్టర్ కె.సిన్హా

క్రీస్తు చూపిన మార్గం అందరికీ అనుసరణీయం……- రెవరెండ్ డాక్టర్ కె.సిన్హా

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 10, (తెలంగాణ ఎక్స్ ప్రెస్):

లోక రక్షకుడు ఏసు క్రీస్తు చూపిన మార్గం అందరికీ అనుసరణీయం అని, ఫౌండర్, ప్రెసిడెంట్, సీనియర్ పాస్టర్ ద అబండెంట్ లైఫ్ చర్చ్ రెవరెండ్ డాక్టర్ కె.సిన్హా అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణ శివారులో గల ఏద మినిస్ట్రీస్ కేంద్రంలో  ఏద మినిస్ట్రీస్ ద్వారా డిసెంబర్ నెల ’20’వ తేదిన నిర్వహించు “*క్రిస్మస్ ప్రత్యేక ఆత్మీయ ఆశీర్వాద కూడిక*” నిమిత్తమై దైవ సేవకులైన టువంటి బ్రదర్.శ్రీనివాసా చారి, సిస్టర్.హెప్సిబా చారి ద్వారా ఏద వర్షిప్ సెంటర్, ఎల్లారెడ్డి నందు ఏర్పాటు చేయబడిన సేవకుల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై దేవుని వాక్యం అందించారు. పాపులను రక్షించడానికి మానవ అవతారంలో వచ్చిన  దేవదూత ఏసు క్రీస్తు అని అన్నారు. ఇట్టి కుడికలో యు పి ఎఫ్  జిల్లా అధ్యక్షులు బ్రదర్.మాణిక్యం, జనరల్ సెక్రెటరీ బ్రదర్.శ్రీనివాసా చారి,  జిల్లా మాజీ అధ్యక్షుడు రెవ.ప్రకాష్ రెడ్డి, ఎల్లారెడ్డి సి ఎస్ ఐ  చర్చ్ పాస్టర్ రెవ.ఎర్రోళ్ల ప్రభాకర్, రుద్రారం పాస్టర్ బ్రదర్ మాణిక్యం, పాస్టర్ వై.స్వామి, బెరాకా మినిస్ట్రీస్ కామారెడ్డి, అన్నారం పాస్టర్ డేవిడ్ , ఎల్లారెడ్డి పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బ్రదర్ జోసఫ్ , జనరల్ సెక్రెటరీ బ్రదర్ విజయ్ , సీనియర్ పాస్టర్ బ్రదర్ భాస్కర్ , నియోజకవర్గంలో ఉన్న ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ మండలాల్లో సేవ చేస్తున్నటు వంటి అనేక మంది దైవజనులు హాజరయ్యారు. కూడిక అనంతరం సామూహిక బోజనాలు చేశారు.

You may also like

Leave a Comment