Home తాజా వార్తలు దళితులకు ఇండ్ల పట్టాలను పంపిణి చేసిన ఎమ్మెల్యే

దళితులకు ఇండ్ల పట్టాలను పంపిణి చేసిన ఎమ్మెల్యే

by Telangana Express

మంచిర్యాల, ఆగస్టు 11, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా హాజపూర్ మండలం దొనబండ గ్రామంలోని దళితులకు ఇండ్లు పట్టాలను, మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు పంపిణీ చేశారు. శుక్రవారం జిల్లాలోని మంచిర్యాల నియెాజకవర్గం హాజీపూర్ మండలం దొనబండ గ్రామ ఎస్సి కాలనిలో నివాసం ఉంటున్న 50 మంది దళిత కుటుంబాలకు ఎమ్మెల్యే, స్థానిక నాయకులతో కలిసి ఇండ్ల నివాస స్థల పట్టా దృవీకరణ పత్రాలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఅర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రంలో గిరిజనులకు, దళితులకు ఇచ్చిన హామీని మర్చిపోకుండా ఒకటి తర్వాత ఒకటి హామీని నెరవేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు అభిమానులు, దళితులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment