– సిఐ శివ శంకర్
నారాయణపేట జిల్లా, ప్రతినిధి, డిసెంబర్ 13 (తెలంగాణ ఎక్స్ ప్రెస్): నారాయణపేట పట్టణంలోని కెబిఎస్ బ్యాంకు పక్కన గల కేబీఎస్ ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తి గత రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఏటీఎం లోకి చొరబడి ఏటీఎం ధ్వంసం చేసి అందులో ఉన్న డబ్బులు దొంగతనం చేయడానికి ప్రయత్నం చేశాడు కానీ డబ్బులు ఏమి పోలేదు అని కేబిఎస్ బ్యాంక్ మేనేజర్ పి. బాల వెంకటన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నారాయణపేట టౌన్ పోలీసులు కేవలం రెండు గంటల్లోనే అట్టి దొంగతనం కు పాల్పడిన నారాయణపేట కురువగేరికి చెందిన తోళ్ల మల్లేష్ (40) అనే వ్యక్తిని పట్టుకొని అట్టి ఏటీఎం ను ధ్వంసం చేసి డబ్బులు దొంగిలించ ప్రయత్నించడానికి ఉపయోగించిన ఒక కొడవల్ని అతని వద్ద నుండి స్వాధీనం చేసుకోవడం జరిగిందనీ ఒక ప్రకటనలో తెలిపారు. కేవలం రెండు గంటల్లోనే ఇట్టి కేసు చేదించి నిందితుని పట్టుకున్న నారాయణపేట టౌన్ పోలీసులను ఎస్ఐ వెంకటేశ్వర్లును, ఎస్ఐ2 కృష్ణ దేవ్, రాము, ఆంజనేయులు, లింగ మూర్తి లను నారాయణపేట సీఐ శివశంకర్ అభినందించడం జరిగిందనీ తెలిపారు.
