Home తాజా వార్తలు గుజరాత్ లో మోడీకి చుక్కలు చూపించిన ఐపిఎస్ ఆఫీసర్

గుజరాత్ లో మోడీకి చుక్కలు చూపించిన ఐపిఎస్ ఆఫీసర్

by Telangana Express

మంచిర్యాల, ఫిబ్రవరి 28, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): గుజరాత్ రాష్ట్రంలో రాజకీయ నాయకులు మోడీ, అమిత్ షా లకు, సంజీవ్ బట్ పేరు వింటేనే దేశంలోనే అత్యంత శక్తివంతమైన పదవుల్లో ఉన్న మోడీ అమిత్ షా కంటిమీద కునుకు ఉండదు సంజీవ్భట్ ఈ పేరు వింటేనే, దేశంలోనే అత్యంత శక్తివంతమైన పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు మోడీ అమిత్ షా లకు కంటిమీదకునుకు ఉండదు. సంజీవ్ బట్ జీవిత చరిత్ర పోలీస్ స్టోరీ సినిమా కంటే తక్కువేమీ కాదు . గుజరాత్ రాష్ట్రంలో 2002 లో మోడీ ముఖ్యమంత్రి గా ఉన్నపుడు జరిగిన అల్లర్ల లో మోడీ పాత్రకు ప్రత్యేక్ష సాక్షిగా ఉన్నారు . గోద్రా ట్రైను దుర్ఘటన తర్వాత మోడీ తన ఇంటివద్ద పోలీసు ప్రముఖులుతో ఏర్పాటు చేసిన సమావేశంలో హిందువుల, మైనార్టీల పై గొడవ పోలీస్ అధికారులు ఎవరు అపొద్దుని మోడీ చెప్పడం విన్నానని, కోర్టు ముందు నిర్భయంగా చెప్పారు.న అనంతరం గుజరాత్ వ్యాప్తం గా మతగార్షణలు జరిగాయి. ఈ అల్లర్లలో 2000 కు పైగా అమాయకులు చనిపోయారు అందులో 90 శాతం మైనార్టీలే కావడం గమనార్హం . ఇదే విషయాన్ని అప్పటి హోం మంత్రి హరెన్ పాండే కూడా చెప్పారు. ఆ తరువాతే ఆయన హత్య జరుగుతుంది. సంజీవ్ భట్ నీ సబర్మతి జైలు సూపరిటెండెంట్ గా మర్చినపుడు అక్కడి ఖైదీలలో ఆయన పై విపరీతం గా ఆదరణ పెరిగింది. హరిన్ పాండే ను, చంపిన నిందితుల్లో ఒకరుతో సంజీవ్ భట్ కలవడం జరిగింది. హోం మంత్రి హారిన్ పాండే ను కన్సీరాం చపినట్లు అతను తెలిపారు. అనూహ్యంగా, కంన్సిరాం హత్యకు గురైనాడు. జైలు సూపరంటెండెంట్ గా అయిన కొద్ది నెలలకే సంజీవ్ భట్ ను మళ్లీ ట్రాన్స్ ఫర్ చెయ్యడం జరుగింది. దీనికి కారణం గుజరాత్ అల్లర్లు హరున్ పాండే హత్య కేసుకు సంబంధించిన అన్ని ఫైల్ లను క్లోజ్ చెయ్యమని, బీజేపీ అమిత్ షా కోరడు దాన్ని నిరాకరించి నందుకై సంజీవ్ బట్టు ను సుపెరిందెంట్ పోస్టు నుండి బదిలీ చేశారని మహేష్ భట్ ఆరోపించారు. సంజీవ్ బట్ బదిలీకి వ్యతిరేకంగా 2000 కు పైగా ఖైదీలు నిరాహార దీక్ష చేశారు. మరోపక్క 1990 లో జాం నగర్ లో జరిగిన మర ఘర్షణాలను ఆపేందుకు అప్పుడు ఎస్పీ గా సంజీవ్ భట్ 150 మందిని అదుపులో తీసుకున్నారు. అందులో ఒకడు అనారోగ్యం తో చనిపోగా అతని సోదరుడు పోలీసులపై కేసు పెడ్డటము ఆకేసులో 8 మంది పోలిసులపై ఆరోపణలు ఉండగా అందులో సంజీవ్ భట్ పేరు ఉండటం తో సంజీవ్ భట్ ను ఇందులో లాగి ఈ రోజు ఆయనను యావజ్జీవ శిక్ష వేయించడం లో కేంద్రం సఫలమైంది. సంజీవ్ బట్ ఏ తప్పూ లేదని 1990 లో వినతి పత్రాన్ని పెట్టిన అప్పటి గుజరాత్ ప్రభుత్వమే 2011 లో ఆయన మోడీ అమిత్ షా కు వ్యతిరేకంగా అఫిడవిట్ పెట్టారు. సంజీవ్ బట్ వినతి పత్రాన్ని వెనక్కు తీసుకోవడం గమనించ వలసిన విషయం దాంతో ఆయన పై పోలీస్ విచారణలు ముమ్మరం గా జరిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ప్రశ్నిస్తున్నoదుకు సంజీవ్ బట్ ను విధి నుండి తొలగించారు. ప్రభుత్వం చెప్పిన కారణం కేవలం సంజీవ్ బట్ డ్యూటీ లో లేనప్పుడు ఆఫీసర్ వాహనం వాడటము తనకు సంబంధం లేని కేసుల్లో తలడుర్చడమే. సంజీవ్ భట్ ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి ఏ రాజకీయ ప్రలోభాలకు లోంగలేదు. సంజీవ్ బట్టు కు తోడుగా ఉన్న 6 గురూ ప్రత్యేక్ష సాక్షులలో 4 గురూ మాట మార్చగా ఇద్దరు అదే మాటపై కట్టుబడి ఉన్నారు. 2011 లో ఒక సంస్థ సంజీవ్ బట్ ను సమ్మనానికి పిలిచినప్పుడు నిరాకరించారు. కారణం ఆ సంస్థ కి చెందిన సభ్యులలో ఒకరు సిక్కుల ఊచకోత లో నిందితుడు అయ్యి ఉండటమే దీన్ని బట్టి సంజీవ్ బట్ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు. గుజరాత్ అల్లర్లలో 100 మందిని చంపానని స్వయంగా చెప్పిన బాబు బజరంగీకి బైల్ లభించింది, ఒక పోలీసు అధికారికి నిజాయితీగా ఉన్నందుకు బహుమానంగా బైల్ నిరాకరణ. న్యాయవ్యవస్థ యలా ఉందో దీన్ని బట్టి చెప్పవచ్చు. అందుకు భయపడే ప్రస్తుతం జరుగుతున్న డిల్లీ అల్లర్లపై వీళ్ళను ప్రశ్నించడానికి ఏ ఐపీఎస్ అధికారి ముందుకు రావడం లేదు.

You may also like

Leave a Comment