*కనకాపూర్ అయ్యప్ప సన్నిధానం గురుస్వామి ఇర్ల గణేష్…*
లోకేశ్వరం,జనవరి 01
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మాలధారణ స్వీకరించిన అయ్యప్ప స్వాములకు దీక్ష కాలం ఎంతో పవిత్రమైనదని కనకాపూర్ అయ్యప్ప సన్నిధానం గురుస్వామి ఈర్ల గణేష్ పేర్కొ న్నారు. మండల కాలంలో పడిపూజలు పూజలు నిర్వహిస్తూ తమ దీక్షా కాలాన్ని కొనసాగి స్తారని తెలిపారు, కార్తీక మాసం నుండి మకర సంక్రాంతి వరకు శ్రీమణికంఠుని అయ్యప్ప మాల ధరించే భక్తులు నిష్టగా దీక్షను కొనసాగించాలని సూచించారు, సన్నిధానంలో అయ్యప్ప మాల స్వీకరించిన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు… అయ్యప్ప మాల ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలో నేను అన్న భావన తొలగిపోయి శారీరకంగా ఉండే పేరు వాటి కోసం ధరించే దుస్తులు, తీసుకునే ఆహారం, శారీరక సౌకర్యాలు, ఆచార వ్యవహారాలు, అన్ని అయ్యప్ప దీక్షస్వీకరించిన వెంటనే తొలగిపో తాయని తెలిపారు,మాల ధరించిన వ్యక్తిని అంతరార్థనంలో భగవంతుని స్వరూపడిగా జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో స్వామి అని పిలవాలని భక్తులకు సూచించారు, ఆయా గ్రామాల్లో సన్నిధానాలు నెలకొల్పి పూజలు చేస్తున్న భక్తులు నియమా నిష్టలతో అయ్యప్ప స్వామిని కొలిస్తే కోరిన కోరికలు తీరుతాయి అని తెలియజేశారు, ముఖ్యంగా కన్నె స్వాములు అత్యధికంగా పడిపూజలకు హాజరుకావాలని సూచించారు, తమ జీవితకాలంలో యువకులు తప్పకుండా అయ్యప్ప దీక్షను స్వీకరించి సన్మార్గంలోనడవాలని ఇతవు పలికారు.
