టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి తులసి ఆగమయ్య
తెలంగాణ ఎక్స్ ప్రెస్ దినపత్రిక
వెల్గటూర్ డిసెంబర్ 12
ప్రభుత్వం పి.అర్సి ని తక్షణమే ప్రకటించి ,అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఆగమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్ర మంలో భాగంగా గురువారం వెల్గటూర్ మండలంలోని వివిధ పాఠశాలల ను సందర్శించి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2023 లో ప్రకటించాల్సిన పీ ఆర్ సి నీ సంవత్సరం గడిచిపోతున్న ప్రభుత్వం పి.ఆర్.సి ఊసే ఎత్తడం లేదనీ పేర్కొన్నారు. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న ఉద్యోగులం దరికీ బేసిక్ పే ప్రకటించి సమ్మె విరమింప జేయాలని ప్రభుత్వానికి సూచించారు.