Home తాజా వార్తలు శనివారం నాడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం

శనివారం నాడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం

by Telangana Express

జోగిపేట నవంబర్ 23:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించిన సందర్భంగా శనివారం నాడు సంగారెడ్డి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు ఆర్. ప్రభాకర్ గౌడ్, జోగిపేట శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించుకుంటూ ప్రజలకు కార్యకర్తలకు స్వీట్లు తినిపిస్తూ ఘనంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించడం జరిగింది, వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలియజేస్తూ అదేవిధంగా ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మహారాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీ కి భారీ విజయాన్ని ప్రజలు కట్టబెట్టారు, అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో అధికారం తీసుకురావడానికి కృత నిశ్చయంతో ఉన్నారని తెలియజేశారు, మన దేశం ప్రపంచ దేశంలో గుర్తింపు పొందాలన్నా అభివృద్ధి చెందాలన్నా సనాత ధర్మం కాపాడాలన్న యువతకు ఉద్యోగాలు రావాలన్న రైతులు గౌరవంగా బతకాలన్న భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అవసరమని తెలియజేశారు, ప్రజలందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటున్నారు అని వారు తెలిపారు.

You may also like

Leave a Comment