- ఏపీఎల్ లో విజేతగా నిలిచిన జి.కే వారియర్స్ జట్టు
ఆమనగల్లు, జనవరి 16
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపల్ పట్టణ కేంద్రంలో అయ్యప్ప కొండ ప్రాంగణం వద్ద ఉన్న ప్రైవేట్ గ్రౌండ్ లో ఆమనగల్లు యువకులంతా కలిసి ఏర్పాటు చేసి నిర్వహించిన ఆమనగల్లు ప్రీమియర్ లీగ్ మంగళవారం విజయవంతంగా ముగిసింది.

ఐపీఎల్ తరహాలో నిర్వహించిన ఈ లీగ్ లో కేవలం ఆమనగల్లు మున్సిపాలిటీకి చెందిన యువ క్రీడాకారులే 6 జట్టులుగా ఏర్పడి మూడు రోజుల పాటు నిర్వహించారు. ఈ లీగ్ లలో జి.కే వారియర్స్ జట్టు విజేతగా నిలిచింది. ఈ నిర్వహించడానికి ప్రోత్సహించిన నల్గొండ విజిలెన్స్ సిఐ గజ్జె చలమంద రాజు గౌడ్, ఆమనగల్లు ప్రముఖ సంఘ సేవకులు పాపిశేట్టి రాము, స్నేహహస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, పి.ఏ.సి.ఎస్ సీఈఓ గోరటి దేవేందర్, సబ్ ఇన్స్పెక్టర్ బలరాం నాయక్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మండ్లి రాములు క్రీడాకారులు పాల్గొన్నారు .