Home తాజా వార్తలు బి ఆర్ ఎస్ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలందరికీ ధన్యవాదములు

బి ఆర్ ఎస్ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలందరికీ ధన్యవాదములు

by Telangana Express

గౌడ సంఘం మండల ప్రతినిధి అనగోని వీరన్న గౌడ్

సైదాపూర్ నవంబర్ 21
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

నిన్న రాత్రి జరిగిన టిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారo సైదాపూర్ మండలంలొని ఎలబోతారం, అలాగే అనుబంధ గ్రామం చింతలపల్లి, రాములపల్లి, రామచంద్రాపూర్, అనుబంధ గ్రామం కురుమపల్లి, జాగీర్ పల్లి, సైదాపూర్ వెన్కేపల్లి గ్రామాలలో హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్, హుస్నాబాద్ బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ మాజీమంత్రి పెద్దిరెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈనెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ హుస్నాబాద్ ఎమ్మెల్యేగా మూడవసారి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో సతీష్ కుమార్ ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది, మహిళలు, యువకులు, వృద్ధులు, ప్రజలందరూ ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు మంగళ హారతులతో, బొట్టు పెట్టి స్వాగతం పలుకుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2014 కంటే ముందు పరిస్థితులు ఏ విధంగా ఉండే, గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఏ విధంగా అభివృద్ధి చెందింది ప్రజలందరూ గమనించాలని ఎలక్షన్ల అప్పుడే కనబడే ప్రతిపక్ష పార్టీల నాయకుల మాటలు నమ్మవద్దని, మీ వాడిని, మీలో ఒకడిని, అడిగిన ప్రతి పని చేస్తూ నియోజకవర్గాన్ని సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్య, మౌలిక సదుపాయాల రంగాలలో అభివృద్ధి చేశానని మున్ముందు నియోజకవర్గ అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నానని, ప్రతిపక్ష పార్టీల నాయకులకు అధికారం పై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని నియోజకవర్గ ప్రజలు తెలివైన వారు, ఉద్యమకారులు, విజ్ఞానవంతులు, మంచి, చెడు తెలిసినవారు అభివృద్ధిని చూసి మరొకసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని హుస్నాబాద్ ఎమ్మెల్యేగా తనను భారీ మెజారిటీతో గెలిపించాలని సతీష్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి , మండల పార్టీ అధ్యక్షులు సోమరపు రాజయ్య వైసీపీ రావుల శ్రీధర్ రెడ్డి చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి బిల్లా వెంకట్ రెడ్డి భాస్కరరావు విజయ నారాయణ రెడ్డి శిరీష ముకుంద రెడ్డి యుగేందర్ రెడ్డి సుమలత అశోక్ రాములు కాంతవ ఓదేలు చందా శ్రీనివాస్ కొండ గణేష్ పద్మజ కొమురయ్య పార్టీ కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి సర్పంచులు రాములు పాపయ్య రాజిరెడ్డి ఎంపిటిసి సభ్యులు అనిత రవీందర్ రెడ్డి సీనియర్ నాయకులు ముత్యాల వీరారెడ్డి కూతురు విధ్వాన్ రెడ్డి సీనియర్ నాయకులు గౌడ సంఘం మండల ఇన్చార్జి అనగోని వీరన్న గౌడ్ పైడిపల్లి రవీందర్ గౌడ్ లక్ష్మీనారాయణ ముత్యాల వీరారెడ్డి ఎర్రం పాపిరెడ్డి నారాయణరెడ్డి యూత్ నాయకులు స్వామి మోహన్ రెడ్డి రవీందర్ రెడ్డి రాజిరెడ్డి శంకర్ రెడ్డి ఉపసర్పంచ్ మధుసూదన్ రెడ్డి వీరాల శ్రీనివాస్ సురేష్ హరీష్ హరీష్ రెడ్డి స్వామి నరేష్ సురేష్ భువనగిరి అనిల్ మాజీ ఉపసర్పంచి రాజు విప్లవ కుమార్ కుమార్ అజయ్ శ్రీకాంత్ సురేష్ మండల పార్టీ టిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు దేవేంద్ర ఆర్థిక సంఖ్యలో మహిళలు మంగళహారతులతో బోనాలు బతుకమ్మ ఆటపాటలతో టిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్కు ఘన స్వాగతం పలికి కారు గుర్తుకు ఓటేస్తామని భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇవ్వడంతో ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఓటర్లకు బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు మండల గౌడ సంఘం ప్రతినిధి అనగోని వీరన్న గౌడ్ ప్రచార కార్యక్రమానికి వేలాదిమందిక తరలివచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

You may also like

Leave a Comment