Home తాజా వార్తలు కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. = రాష్ట్ర మంత్రి హరీష్ రావు

కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. = రాష్ట్ర మంత్రి హరీష్ రావు

by Telangana Express

చేగుంట మండల అభివృద్ధి కోసం ప్రభాకర్రెడ్డిని గెలిపిచుకోవాలి

  • దుబ్బాకలో ఒక సారి తప్పు చేసి మోసపోయాం మల్లి మోనపోవద్దు • మీ నమస్యలన్ని తీర్చడానికి నేను బాధ్యత తీసుకుని పూర్తి చేయిస్తా • మీ అశిర్వాదంతోనే కొత్త ప్రభాకర్రెడ్డి మల్లి మీ ముందుకు వచ్చాడు

చేగుంట నవంబర్ 28 :—-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మల్లి ముఖ్యమంత్రి కేసీఆర్నే చేయాలని మంత్రి తన్నీర్ హరీషావు అన్నారు. మంగళవారం రోజున చేగుంట మండలంలోని వడియారం, చేగుంట లలో దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి గెలువు కోసం ఎన్నికల ప్రచారంలో బాగంగారోడ్డు షో లో పాల్గోన్న ఆర్థిక మంత్రి తన్నీర్ హరీష్ రావు మాట్లాడుతూ గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో మనం తప్ప చేసి మోనం పోయాం ఆయనతో దుబ్బాక నియోజక వర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అందు కోసం మన ముఖ్యమంత్రి కేసీఆర్ దుబ్బాక ఎమ్మెల్యేగా పోటి చేయాలని మన ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిని నిలిపారు. మీ రందరు కారు గుర్తుకే ఓటు వేసి ప్రభాకర్రెడ్డి ని గెలిపించాలని కోరాడు. ప్రబాకర్ రెడ్డిని గెలిపిస్తే చేగుంట మండలానికి అవసరమయ్యే అభివృద్ధి పనులు చేసుకుందాం అని తెలిపారు. మహిళలకు మహిళా బిల్డింగ్ కావాలని కోరారు. మెదక్ రోడ్డు రైల్వే బ్రిడ్జి కావాలని కోరారు. యువకులకు స్టేడియం• చాపునుండి బతక బయటి ఎడ్డా మీ రుణం తిర్చుకుంటా…… ఎంద కొత్త ప్రభాకర్రెడ్డి……. నన్ను రాజకీయంగా ఎదురుకోకుండా దొంగచాటుగా కత్తి తో పొడిచి నన్ను చంపడానాకి ప్రయత్నం చేసారు. మీ అందరి దయతో మీ ఆశిర్వాదంతో బతికి బయట వడ్డా నన్ను మీరు దుబ్బాకలో ఎమ్మెల్యేగా గెలిపిచేస్తే మీ అందరి రుణం తీర్చుకుంటా అని ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో బాగంగా చివరి రోజు చేగుంటలో రోడ్ షో లో పాల్గోని మాట్లాడుతూ దుబ్బాకలో రేవు జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. తనను దుబ్బాకలో గెలిపిస్తే చేగుంట మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చి దిద్దుతానని తెలిపారు. ప్రతి వక్షాల మాటలు నమ్మవద్దని తెలిపారు. ఇంత మంది తన కోసం వచ్చినందుకు మీఅందరికి ప్రత్యే దన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు ఎంపీపీ మాసులశ్రీనివాస్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, చేగుంట సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, వడియారం సర్పంచ్ వడ్డెపల్లి తిరుమల నర్సింలు, ఎంపీటీసీ బక్కి లక్ష్మి రమేష్, చేగుంట ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి, కమిటీ సభ్యులు మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ రజనక్ ప్రవీణ్కుమార్, రంగయ్య గారి రాజిరెడ్డి ఇబ్రహీంపూర్ సోసైటీ చైర్మన్ కొండల్ రెడ్డి, వైన్ చైర్మన్ తానీష, మాజి చైర్మన్ నారాయణరెడ్డి, మాజి టెలికం బోర్డు మెంబర్ వేణుగోపాల్ శర్మ , పట్టణ అధ్యక్షులు యాదగిరి సోమ సత్యనారాయణ, లక్ష్మణ్, అన్నం రవి సాబేర్, అలీ, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment