Home Epaper వేదిక్ మాథ్స్ రాష్ట్ర స్థాయి పోటీలలో టెక్నోస్కూల్ విద్యార్థి ప్రతిభ

వేదిక్ మాథ్స్ రాష్ట్ర స్థాయి పోటీలలో టెక్నోస్కూల్ విద్యార్థి ప్రతిభ

by Telangana Express

– ద్వితీయ బహుమతి సాధించిన టెక్నోస్కూల్ విద్యార్థిని మ్యాక ఐశ్వర్య రెడ్డిఆమనగల్లు, ఫిబ్రవరి 26(తెలంగాణ ఎక్స్ ప్రెస్):హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో 25-02-2024 ఆదివారం పిఎన్ఎం స్కూల్లో జరిగిన వేదిక్ మాథ్స్ రాష్ట్ర స్థాయి పోటీలలో ఆమనగల్లు లిటిల్ స్కాలర్స్ టెక్నో స్కూల్ విద్యార్థి మ్యాక ఐశ్వర్య రెడ్డి (7 వ తరగతి) ద్వితీయ బహుమతి సాధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర కు చెందిన మొత్తం 170 పాఠశాలల నుండి 400 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీ పరీక్షలలో అత్యంత ప్రతిభ కనబరచి ద్వితీయ స్థానం పొందింది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మరియు యాజమాన్యం విద్యార్థినిని శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచి ఈ ప్రాంతానికి పాఠశాలకు గర్వకారణంగా నిలిచిన విద్యార్థిని ఐశ్వర్యను అభినందిస్తూ గ్రామీణ స్థాయి నుండి వెలుగొందిన ఆణిముత్యంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా చైర్మన్ చుక్క అల్లాజిగౌడ్ మాట్లాడుతూ గత 45 సంవత్సరాలుగా పాఠశాల నుండి అంతర్ జిల్లా, అంతర్ రాష్ట్ర పోటీలలో మంచి ప్రతిభ కనబరచి అభాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ లలో తమ విధ్యార్థులు గెలుపొందుతున్నారని అన్నారు. ఈ పోటీలలో పాల్గొన్న ఇదే పాఠశాలకు చెందిన 2వ తరగతి విద్యార్థి ఈ. లక్ష్మి ప్రేమను కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సుజాత రెడ్డి, డైరెక్టర్ సుక్క సావిత్రి, అకాడమిక్ అడ్వైజర్ సుదర్శన్ రెడ్డి, ఉపాధ్యాయులు చలం, యాదయ్య, శ్రీశైలం, వెంకటేశ్వర్లు, తేజ, శ్వేత, హైమావతి, స్వాతి, శ్రీజన్య, రాధిక, గీత, మమత, నందిని, లక్ష్మి, మధు శ్రీ, నాగమణి, రాధిక, శర్మ, శివలింగం, వరలక్ష్మి, ఝాన్సీ, అలివేలు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment