పూల వానతో వీడ్కోలు పలికిన జడ్.పి.హెచ్.ఎస్ వీణవంక విద్యార్థులు …
బదిలీ అయిన ఉపాధ్యాయుల సేవలు ప్రశంసనీయం..
జెడ్పిహెచ్ఎస్ హెడ్మాస్టర్ అశోక్ రెడ్డి..
వీణవంక, ఫిబ్రవరి 7( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వీణవంకలో ఇటీవల కాలంలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు హెచ్ఎం అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానం చేశారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ … బదిలీ ఉద్యోగులకు సర్వసాధారణమని ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్ గత ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో వ్యాసరచన ఉపన్యాస పోటీలలో జిల్లాస్థాయి మండల స్థాయి విజేతలుగా విద్యార్థులను నిలవడంలో వారు చేసిన కృషి అభినందనీయం అన్నారు. ఎన్సిసి క్యాండేట్ల ను తీర్చిదిద్దిన విధానంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్ కృషిని అభినందించారు.ఈ సన్మాన కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణు, జయ, రవి కిరణ్, సువిత కుమార్, శ్రీనివాస్ అరుణ శ్రీ,వీరాచారి, పాఠశాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.