Home తాజా వార్తలు ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలి…- ఎల్లారెడ్డి ఎంఈఓ ఎవి.వెంకటేశం

ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలి…- ఎల్లారెడ్డి ఎంఈఓ ఎవి.వెంకటేశం

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 17,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యా బోధన చేయాలని, ఎల్లారెడ్డి ఎం ఈ ఓ ఎవి.వెంకటేశం సూచించారు. మంగళవారం పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మండల ప్రాథమిక స్థాయి కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఉపాధ్యాయుల నుద్దేశించి మాట్లాడారు. ఉపాధ్యాయులు పాఠశాలకు చదువుకోవడానికి వచ్చే బీద విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో కృత్యాదార పద్దతిలో బోధన చేయాలని, ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ప్రార్థన వేళలో విధిగా హాజరు కావాలని, సమయ పాలన ఖచ్చితంగా పాటించాలని అన్నారు. ఇటీవలె డీఎస్సీ లోఎంపికై మండలంలోని పలు పాఠశాలల్లో విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయులకు సర్వీస్ కు సంబంధించిన పలు విషయాలను తెలియజేసి, విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధన అందించాలని తెలిపారు. ఆతర్వాత మండల నోడల్ అధికారి ఎల్ .రాజులు మాట్లాడుతూ…. ఉపాద్యాయులు తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి సారించి, వారిని ఏ, బిగ్రేడ్ లలో తీసుకు వచ్చే విధంగా అర్థమయ్యేలా బోధించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంఈఓ ఎవి.వెంకటేశం, మండల నోడల్ అధికారి ఎల్. రాజులు, కాంప్లెక్స్ హెచ్ ఎం లు వి.వెంకటేశ్వర్ రావు, వెంకటేశ్వర్లు, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment