Home తాజా వార్తలు జరగబోయే ఎన్నికల్లో టిడిపి సత్తా చాటాలి : టిడిపి నూతన కార్యాలయం ప్రారంభం.

జరగబోయే ఎన్నికల్లో టిడిపి సత్తా చాటాలి : టిడిపి నూతన కార్యాలయం ప్రారంభం.

by Telangana Express

హాజరైన జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు మిర్యాలగూడ ఇంచార్జ్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్

మిర్యాలగూడ ఆగస్టు 24 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి సత్తా చాటాలని, తెలుగుదేశం పార్టీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు, మిర్యాలగూడ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్ పేట లో గల మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ భవన సముదాయంలో టిడిపి నూతన కార్యాలయాన్ని బంటు వెంకటేశ్వర్లు ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ అధికార బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న విషయాన్ని టిడిపి కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి తెలియజేయాలన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందని, జరగబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలోమిర్యాలగూడ పట్టణ పార్టీ కన్వీనర్ వడ్డెబోయిన శ్రీనివాస్, రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షులు నసీరోద్దీన్ బాబామండల కన్వీనర్ చిలకల వెంకన్న, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి గంధం శ్రీనివాస్ రాష్ట్ర టిఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు మచ్చా సైదులుఅడవి దేవులపల్లి మండల కన్వీనర్ మున్నా వెంకటేశ్వర్లు,
దమరాచర్ల మండల కన్వీనర్ పగడి పాటి రాంరెడ్డి
సైదానాయక్,రాష్ట్రతెలుగుయువత కార్యదర్శిమాదార్ఐటీడీపి పార్లమెంట్ రావిరాల నాగేందర్,ఏచూరి అనంతరాములు,రామారావు,చవలవెంకటేశ్వర్లు,పోట్ల శంకర్ రావు రమేష్ నాయక్, నవీన్, శోభన్ వెంకటరెడ్డి టి ఎన్ టి యు సి నాయకులు సయ్యద్, బొట్టు వెంకన్న, కన్నెకంటి శ్రీనివాస్ పాల్గొన్నారు.

You may also like

Leave a Comment