Home తాజా వార్తలు రేగోడు మండలంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు

రేగోడు మండలంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు

by Telangana Express

యువత సరైన మార్గంలో నడవాలి

రేగోడు జనవరి 12 తెలంగాణ ఎక్స్ ప్రెస్

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా రేగోడు మండలంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో మరియు ప్యారారం గ్రామంలో యువత ఆధ్వర్యంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలను జరుపుకున్నారు.ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు దిక్సూచి లా ఉండి భారతీయ భవిత యువతరం చేతుల్లో ఉందని, దేశ తలరాతలను మార్చగలిగే సత్తా వారిలోనే ఉందని, యువతరం శక్తి సామర్థ్యాలపై అచంచలమైన నమ్మకం ఉంచి వారిలో చైతన్యాన్ని నింపిన స్ఫూర్తి ప్రదాత, దర్శనికుడు, ఆదర్శనీయుడు స్వామి వివేకానందా అని, ఇనుప నరాలు ఉక్కు కండరాలున్న 100 మంది యువకులను ఇస్తే ఈ దేశాన్ని మార్చి చూపిస్తానంటూ చైతన్య స్ఫూర్తిని స్వామి వివేకానంద నింపినాడని, ఈ దేశ భవిష్యత్తు తీర్చిదిద్దే శక్తి యుక్తి యువతరం చేతుల్లోనే ఉందని అన్నారు. వజ్ర సంకల్పం ఉండి పట్టుదలతో చేసే ప్రతి ప్రయత్నం విజయాన్ని చేకూరుతుందంటూ, లేవండి మేల్కొండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి అంటూ యువతరాన్ని చైతన్య పదం వైపుకు అడుగులు వేయించాడు అని అన్నారు. భారతీయ యువతరంలో ప్రధాన లోపం భయం మనిషి పతనానికి భయమే ప్రధాన కారణమని భయం లోనే చావు ఉందని బలమే జీవనం బలహీనమే మరణమని, మానవజాతికే అతి గొప్ప సందేశాన్ని ఇచ్చాడని అన్నారు. కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడిన తిరిగి మళ్లీ లేస్తున్నందుకు అని, ప్రపంచంలో నిరాశ నిస్రులతో సతమవుతున్న యువతరంలో నవచైతన్యాన్ని నింపాడు అని, ఈ ప్రపంచంలో ఉన్న సకల శక్తి నీలో ఉంది అసమర్థుడనని భావించకు నీవు ఏమైనా చేయగలవు అన్నిటిని సాధించగలవు అంటూ ఆధునిక భగవద్గీతను బోధించాడని అన్నారు. వివేకానందుడు చెప్పిన బోధనలు ఆయన ఇచ్చిన స్ఫూర్తితో యువతరం దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక ,ముఖచిత్రాన్ని మార్పు చేస్తూ అభ్యుదయ పథంలో పయనిస్తారని ఆశిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో రేగోడు మండల యువకులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment