బిచ్కుంద డిసెంబర్ 21:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా
జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని
3170 ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నారని వాటి వివరాలు కోసం గ్రామపంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆరుగురు సిబ్బంది రోజు గ్రామాలలో ఇంటింటికి వెళ్లి సర్వే పూర్తి వివరాలు నమోదు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటివరకు 806 ఇందిరమ్మ ఇల్లు సర్వే పూర్తి చేశామని తెలిపారు.
గ్రామ ప్రజలు ఈ సర్వేకు ఇంటిదగ్గర అందుబాటులో ఉండి సహకరించాలని కోరినారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు జూనియర్ అసిస్టెంట్ చందర్ ,ఈరన్న, మహేష్, సంజయ్ తదితరులు పాల్గొంటున్నారు.
