Home తాజా వార్తలు ఇందిరమ్మ ఇండ్ల సర్వే పకడ్బందీగా నిర్వహించాలి….సర్వే పనులు వేగవంతం చేయాలి….

ఇందిరమ్మ ఇండ్ల సర్వే పకడ్బందీగా నిర్వహించాలి….సర్వే పనులు వేగవంతం చేయాలి….

by Telangana Express
      - కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ 

ఎల్లారెడ్డి, డిసెంబర్ 24,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వేను పకడ్బందీగా నిర్వహిం చాలని, కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం ఎల్లారెడ్డి మండలంలోని మీసాన్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం చేస్తున్న సర్వే తీరును ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం కోసం రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇండ్లు మంజూరు కోసం సర్వే చేపడుతున్నామని తెలిపారు. స్వంత భూమి ఉండి నిరుపేద లైన వారి వివరాలు, ఫోటోలు, భూముల వివరాలు, సేకరించి యాప్ లో పొందుపరు స్తున్నామని తెలిపారు. సర్వేయర్లు ఇండ్ల కోసం ప్రజాపాలన లో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పకడ్బందీగా, పక్కాగా సేకరించి యాప్ లో అప్లోడ్ చేయాలని అన్నారు. సర్వే పనులను వేగవంతం చేయాలని, రోజుకు కనీసం 30 నుండి 40 ఇండ్ల వరకు సర్వే చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వెంట ఆర్డీఓ మన్నె ప్రభాకర్, ఎంపీడీఓ అతినారపు ప్రకాష్, ఇంచార్జి తహశీల్దార్ చరణ్ సింగ్, పంచాయతీ కార్యదర్శి రాజు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment