వీణవంక ఎస్సై బి వంశీకృష్ణ..
వీణవంక, ఫిబ్రవరి 12( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బొంతుపల్లి గ్రామానికి చెందిన ముష్క సదయ్య (45) కుటుంబ ఆర్ధిక ఇబ్బందుల వలన మరియు బిడ్డ పెళ్లి గురించి ఆలోచించుకొని, ఆర్థిక పరమైన సమస్యల వలన జీవితం పై విరక్తి చెంది, సోమవారం ఉదయం 6:30 గంటలకు తన పొలము వద్దకు వెళ్లి, మోదుగు చెట్టుకు ప్లాస్టిక్ తాడుతో ఉరి వేసుకొనిచనిపోయినడని,మృతుడి భార్య ముష్క రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనైనదని, వీణవంక ఎస్సై బి వంశీకృష్ణ తెలిపారు.