- యువత సన్మార్గంలో నడవడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయి
- ఆకుతోటపల్లి గ్రామ యువ నాయకులు న్యాలపట్ల నరేందర్ రెడ్డి
ఆమనగల్లు, జనవరి 17
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల పరిధిలోని ఆకుతోటపల్లి గ్రామంలో వాలీబాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆకుతోట పల్లి ప్రీమియర్ లీగ్ లో గెలిచిన విజేతలకు స్పాన్సర్ గ్రామ యువ నాయకులు న్యాలపట్ల నరేందర్ రెడ్డి నగదు బహుమతులతో పాటు షీల్డ్ లు, మెడల్స్ అందజేశారు. విజేతగా నిలిచిన వంశీ జట్టు కు 7500 రూ, ద్వితీయ స్థానంలో నిలిచిన షఫీ జట్టు కు 4000 రూ, తృతీయ స్థానంలో నిలిచిన అనిల్ జట్టుకు 2000 రూపాయల నగదు బహుమతులతో పాటు జ్ఞాపికను నరేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా గ్రామాలలో యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా, మంచి ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లేష్, ఆర్గనైజర్లు వంశీ, శ్రీకాంత్, మహేష్, శేఖర్ గ్రామ పెద్దలు రాంచందర్, క్రాంతి, బాలు, సెహ్వాగ్, సుధాకర్, కృష్ణ, యాదగిరి, జాంటి, యువకులు, క్రీడాకారులు హాజరయ్యారు.