Home తాజా వార్తలు మరుగుదొడ్ల సౌకర్యం లేక రోడ్డెక్కిన  విద్యార్థులు

మరుగుదొడ్ల సౌకర్యం లేక రోడ్డెక్కిన  విద్యార్థులు

by Telangana Express

– విద్యార్థులకు మద్దతు తెలిపిన  పీ డీ ఎస్ యు

నారాయణపేట జిల్లా ప్రతినిధి జులై 24 (తెలంగాణ ఎక్స్ ప్రెస్):
కేజీబీవీ లో మూత్రశాలలు, మరుగుదొడ్ల, నీటి సౌకర్యం లేకుండా వారం రోజులపాటు ఇబ్బందులు పడ్డ విద్యార్థినులు. ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూ హాస్టల్లో ఉండి ఎట్లా చదువుకుంటారని (పిడిఎస్ యు) మండల అధ్యక్షుడు బి.మహేష్ అన్నారు. వివరాల్లోకి వెళితే నారాయణపేట జిల్లా, ధన్వాడ మండలం కేజీబీవీ టైప్-4 బాలికల వసతిగృహము లో విద్యార్థినులకు సరైన సౌకర్యం లేక విసిగిపోయి రోడ్డుపై బేటాయించిన విద్యార్థినులు , వీరికి మద్దతు తెలిపిన (పి.డి.ఎస్.యు నాయకులు. ఈ సందర్భంగా (పి.డి.ఎస్.యు మండల అధ్యక్షుడు బి.మహేష్ మాట్లాడుతూ ధన్వాడ మండలంలో ఉన్న కేజీబీవీ టైప్-4 బాలికల వసతిగృహము లో వారం రోజులుగా విద్యార్థులకు వాటర్ సౌకర్యం నిలిచిపోవడంతో వారం రోజులుగా విద్యార్థులు స్నానాలు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడిందని, మూత్రశాలలు, మరుగుదొడ్లు, డ్యామేజ్ కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితి ఉన్నదనీ, రెండు మూడు రోజులుగా రిపేర్ చేయిస్తున్నమంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప సమస్యను పరిష్కరించడం లేదని ఆగ్రహించిన విద్యార్థులు, (పిడిఎస్ యు) నాయకులు కిష్టాపూర్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి డిఇఓ గోవిందరాజులు, జిసిడిఓ నర్మద , పోలీసులు రాస్తరోకో సంఘటన స్థలానికి చేరుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సాయంకాలానికల్ల మీ సమస్యను పరిష్కరిస్తామని విద్యార్థులకు, విద్యార్థి సంఘ నాయకులకు హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.ఈ కార్యక్రమంలో (పి.డి.ఎస్.యు) నాయకులు రమేష్ ,గణేష్ తోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment