Home తాజా వార్తలు విద్యార్థులకు 90 రోజుల వార్షిక ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం చేయాలి….- జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం

విద్యార్థులకు 90 రోజుల వార్షిక ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం చేయాలి….- జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 17,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

విద్యార్థులను 90 రోజుల ప్రణాళికతో వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలి అని, కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం సూచించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, మంగళవారం జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ షేక్ సలాం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. అనంతరం కళాశాలలో అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. 90 రోజుల ప్రణాళికతో విద్యార్థులను వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి రోజూ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తునే వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు. కళాశాలలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకు రావాలని కోరారు. గతంలో కంటే ఈ సంవత్సరము మెరుగైన ఫలితాలు తీసుకు రావాలని ఇందుకోసం అన్ని సబ్జెక్టుల అధ్యాపకులు చిత్త శుద్ధిగా పని చేయాలని, ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి అని పేర్కొన్నారు. ఫిబ్రవరి మాసంలో ప్రిఫైనల్, ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని, అప్పటి వరకు కళాశాలలో సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ సంవత్సరం జిల్లాలో వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ కళాశాలలను కాపాడుకుంటూ భవిష్యత్ తరాల వారి కోసం కళాశాలలను తీర్చి దిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సయ్యద్ యూసుఫ్ హుస్సేన్, అధ్యాపకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
.

You may also like

Leave a Comment