మంచిర్యాల, జనవరి 29, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులు బోధించే పాఠాలు శ్రద్ధతో వినాలని, జన్నారం మండల ఆంగ్ల భాష పోరం అధ్యక్షుడు దాముక కమలాకర్ కోరారు. సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణంలోని నిర్వహించిన సమావేశంలో విద్యార్థులు ఆంగ్లభాషపై పట్టు సాధించాలని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జన్నారం కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఆంగ్ల భాష విజార్డ్ డ్రామా పోటీలను నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు జన్నారం మండల ఆంగ్ల భాష ఫోరం అధ్యక్షుడు దాముఖ కమలాకర్, వివిధ ఉన్నత పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు కే జనార్ధన్, బాధ్యులు సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు బోధించే పాఠాలు శ్రద్ధతో విద్యార్థులు వినాలి
37
previous post