Home తాజా వార్తలు విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి..- ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి..- ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 12,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, ఎల్లారెడ్డి ఆర్డీఓ , మండల ప్రత్యేక అధికారి మన్నె ప్రభాకర్ అన్నారు. స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మూడు రోజుల పాటు సిఎం కప్ – 2024 క్రీడా పోటీలు కొనసాగాయి. గురువారం చివరి రోజున ముగిసిన క్రీడా పోటీల్లో వివిధ విభాగాల్లో గెలుపొందిన క్రీడాకారులకు రాత్రి బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీవో మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలోని క్రీడాకారుల నైపుణ్యాలను వెలికి తీసి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిది ద్దేందుకు రాష్ట్ర సర్కార్ సీఎం కప్ 2024 పోటీలను నిర్వహిస్తుందన్నారు. అనంతరం మరో ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ మాట్లాడుతూ.. సీఎం కప్ పోటీ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, గత ప్రభుత్వం క్రీడా నిర్వహణ పట్ల నిర్లక్ష్యం చూపిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టడం సంతోషకర మన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో గ్రామస్థాయి నుంచి ఒలింపిక్స్ వరకు ఎదగాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం వివిధ విభాగాల్లో మండల స్థాయిలో గెలుపొందిన జట్లకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అతినారపు ప్రకాష్, తహశీల్దార్ అల్లం మహేందర్ కుమార్, ఏ ఎం సి చైర్ పర్సన్ రజిత వెంకట్రాంరెడ్డి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ఎం.శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల విద్యాసాగర్, పీఈటీలు, పీడీలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment