Home తాజా వార్తలు ఆరోగ్యం పట్ల విద్యార్థులు జాగ్రత్తలు ఉండాలి

ఆరోగ్యం పట్ల విద్యార్థులు జాగ్రత్తలు ఉండాలి

by Telangana Express

ముధోల్:27జనవరి(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ఆరోగ్యం పట్ల విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆకాష్ అన్నారు.శనివారం మండల కేంద్రమైన ముధోల్ లోని బాలుర గురు కుల పాఠశాలలో వైద్య శిబిరాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిజనల్ వ్యాధులు ప్రబ లుతున్న కారణంగా విద్యార్థులు ముం దస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కలుషితమైన నీరు ఆహారం వల్ల కల రా, డయేరియా వచ్చే ప్రమాదం ఉంద న్నారు.జ్వరాలు వస్తే భయపడాల్సిన అవసరం లేదని వైద్యులను సంప్రదిం చాలన్నారు. విద్యార్థులు భోజనం చేసే ముందు కాళ్లు, చేతులను శుభ్రంగా కడుక్కోవాలన్నారు.అనంతరం విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్ బిఎస్ కే వైద్యులు మతిన్, అవినాష్, అస్రారర్ సిద్ధికి, సూపర్వైజర్ దత్తు రాం, పాఠశాల ప్రిన్సిపాల్ అమృత య్య,ఎంఎల్ హెచ్ పిలు రూప, జయ శ్రీ, ఏఎన్ఎంలు విజయ, రాజశ్రీ, పైలట్ గడ్డం సుభాష్, ఆశ వర్కర్లు సుజాత,యమున పాల్గొన్నారు.

You may also like

Leave a Comment