Home తాజా వార్తలు శ్రీ సాయి అనాధ వృద్ద ఆశ్రమం కు వివేకానంద పాఠశాల విద్యార్థులు విరాళం అందజేత

శ్రీ సాయి అనాధ వృద్ద ఆశ్రమం కు వివేకానంద పాఠశాల విద్యార్థులు విరాళం అందజేత

by Telangana Express

మంచిర్యాల, మార్చి 28, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, కలమడుగు వివేకానంద ప్రైవేట్ పాఠశాల కు చెందిన విద్యార్థులు సాయి అనాధ వృద్ధాశ్రమకు విరాళం అందజేశారు. గురువారం జన్నారం మండలం కలమడుగు వివేకానంద ప్రైవేట్ పాఠశాల నుండి శ్రీ సాయి అనాధ వృద్ధ ఆశ్రమం కోసం ఆనాధశ్రయం ప్రతినిధి వాసుకి ఆ పాఠశాల ద్వారా 7, 355 సేకరించి ఆశ్రమం ప్రతినిధికి అందజేయడం జరిగింది. అనాధ వృద్ధాశ్రమంలో ఉంటున్న వారికి తమ వంతుగా ఆర్థిక సాయం చేయడం జరిగిందని, కలమడుగు వివేకానంద ప్రైవేట్ పాఠశాల కు చెందిన విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు అమరగుండ సతీష్ ఆధ్వర్యంలో విరాళాలు అందజేశారు. అధికారులు ప్రజాప్రతినిధులు యువకులు, యూత్ అసోసియేషన్ ద్వారా మరి విరాళాలు అనాధ వృద్ధ ఆశ్రమానికి అందజేయాలని విద్యార్థులు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సతీశ్ గౌడ్, ఇంచార్జీ తిరుపతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

You may also like

Leave a Comment