తుంగతుర్తి (తెలంగాణ ఎక్స్ ప్రెస్) డిసెంబర్ 23
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించినప్పుడే గుర్తింపు లభిస్తుందని లైన్స్ క్లబ్ ఆర్సి గుడిపూడి వెంకటేశ్వరరావు అన్నారు సోమవారం మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు సూర్యాపేట లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగతుర్తి ప్రభుత్వ పాఠశాలలో చదివి నేడు న్యాయవాదిగా రాణించడం సంతోషంగా ఉందని అన్నారు. ఆ గ్రామ ప్రజలకు సేవ చేయాలని దృఢ సంకల్పంతో ప్రస్తుతం విద్యార్థులకు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడా సామగ్రి అందజేసినట్లు గతంలో ఎన్నారై దాతర సహకారంతో తుంగతుర్తి నాగారం పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ ను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. రానున్న రోజుల్లో తుంగతుర్తి పాఠశాలలో ఓపెన్ జిమ్ ఏర్పాటు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. లైన్స్ క్లబ్ నెంబరు నల్లగొండ జిల్లా వాసి క్రీడా సామాగ్రి దాత రేపాల మదన్మోహన్ మాట్లాడుతూ నేటి వరకు తాను సుమారు 90 పాఠశాలకు ఆయన క్రీడా సామాగ్రిని పంపిణీ చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఇష్టపడి కష్టపడి చదివి ఉన్నప్పుడే మంచి మార్కులతో మంచి ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు అని తెలిపారు. ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం వచ్చేంతవరకు పోరాటం చేయవలసిన ఆవశ్యకత ఉందని తెలిపారు సమాజంలో ప్రతి ఒక్కరు ఏదో విధంగా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు సహదేవ్, లైన్స్ క్లబ్ చైర్మన్ రమణారెడ్డి లక్ష్మీ కాంత్ రెడ్డి అశోక్ రెడ్డి పిచ్చయ్య పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
