మంచిర్యాల, మార్చి 07, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బుధవారం మాదారం గ్రామానికి వచ్చిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కి మాదారం స్థానిక ప్రజలు, నాయకులు వినతి పత్రం అందజేశారు. ఎన్నో ఏళ్ల నుండి సింగరేణి క్వార్టర్లలో నివాసం ఉంటున్న ప్రజలకు ఇండ్ల పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని గ్రామస్తులు కలెక్టర్ని కోరారు. మాదారం ఊరు శివారు ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ లో వెలికి తీసే మట్టిని, గ్రామ సమీపంలో పోయకుండా చూసి ఊరును ఊరిలో నివాసం ఉంటున్న ప్రజలను కాపాడాలని కోరారు. అదే విధంగా “మాకు ఓసి వద్దు, సొంత ఇంటి కళే ముద్దు” అనే నినాదాన్ని తెలియజేస్తూ ఊరిలో నివిస్తున్న వారందరికీ న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి మాదారం గ్రామ ప్రజలకు న్యాయం చేస్తారని తెలియజేశారు.
ఊరు కోసం పోరాటం గ్రామ ప్రజలు కలెక్టర్ వినతి
61
previous post