జమ్మికుంట ఎక్సైజ్ సీఐ అక్బర్ హుస్సేన్
వీణవంక,నవంబర్ 8(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
తెలంగాణ రాష్ట్ర సాధారణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ కరీంనగర్, జిల్లా ఎక్సైజ్ అధికారి కరీంనగర్ ఆదేశాల మేరకు జమ్మికుంట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 3 మండలాలైన జమ్మికుంట ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో ఎన్నికల కోడ్ అమలులోనికి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అక్రమంగా మద్యం , నాటు సారాయి అమ్మిన వారిపై దాడులు చేసి మొత్తం 184 కేసులు నమోదు చేయటం జరిగింది – 190 లీటర్ల నాటు సారాయి 28,444 లీటర్ల బెల్లం పానకాలను 576 కిలోల బెల్లంను,278 ఆటర్ల మద్యం బాటిళ్ళ సీసాలను స్వాదినం చేసుకోని మూడు ద్విచక్రవాహనాలను సీజ్ చేయటం జరిగింది. ముందస్తుగా తహసిల్దారుల వద్ద బైండోవర్ చేయటం జరిగింది. అక్రమంగా మద్యం నిల్వ చేసినా, నాటుసారాయి చేసినా, అమ్మిన ఎన్నికల నిబంధనలలో భాగంగా వారి పై చర్యలు తప్పవని ఎక్సైట్ సిఐ ఎండి అక్బర్ హుస్సేన్ తెలిపారు.