తిమ్మాపూర్ సిఐ ఇంద్రసేనారెడ్డి
చిగురు మామిడి నవంబర్ 2
( తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
ఎన్నికల నియమ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలోని దర్గా వద్ద ఎన్నికల నియమావళి పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమలులోకి ఉన్నందున రాజకీయ పార్టీలు ప్రజలు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.ఎన్నికలు అయ్యేంతవరకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కేసులపాలై ఇబ్బందులు గురి కావద్దని తెలిపారు.2023 సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మండలంలోని సుందరగిరి ఇందుర్తి చిన్న ముల్కనూర్ ఆయా గ్రామాల పోలింగ్ బూతులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో చిగురుమామిడి ఎస్ఐ బి రాజేష్, పోలీస్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.