తెలంగాణ ఎక్స్ ప్రెస్ 03/12/24
భైంసా పట్టణం లోని బస్టాండ్ డాక్టర్ లైన్ చౌరస్తా దగ్గర జన సేన పార్టీ ఆధ్వర్యంలో వీరుడికి జోహార్లు అర్పిస్తూ ఉద్యమ వందనాలు తెలియచేయడం జరిగింది.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంత్ చారి. మహనీయుడి వర్ధంతి ని జన సేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు
శ్రీకాంత్ చారి త్యాగాలను యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు కొనసాగాలి. శ్రీకాంత్ చారి జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి.శ్రీకాంత్ చారి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆత్మార్పణం చేసుకున్న శ్రీకాంతాచారి అమరత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరువరదన్నారు.ఇలాంటి విరుడిని కన్న వారి తల్లి తండ్రుల కు మా పాదాభివందనాలు తెలియచేస్తున్నాం.ఈ కార్యక్రమంలో విశ్వ బ్రహ్మణ సంఘం టౌన్ ప్రధాన కార్యదర్శి రామోజివార్.గంగాప్రసాద్, సాయినాథ్, శ్రీనివాస్, ఫారుఖ్, సచిన్, విట్టల్ సింగ్, చిన్నన్న తదితరులు పాల్గొన్నారు…
శ్రీకాంత్ చారి వర్ధంతి
65