Home తాజా వార్తలు డబుల్ బెడ్ రూం ఇళ్ల పెండింగ్ పనులు వేగవంతం చేయండి…ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నె ప్రభాకర్

డబుల్ బెడ్ రూం ఇళ్ల పెండింగ్ పనులు వేగవంతం చేయండి…ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నె ప్రభాకర్

by Telangana Express

ఎల్లారెడ్డి, నవంబర్ 26,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి పట్టణ శివారులోని సోమార్ పేట్ బై పాస్ సమీపంలో నిర్మాణాలు పూర్తి చేసుకుని, పెండింగ్ లో ఉన్న మౌళిక వసతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నె ప్రభాకర్ సదరు కాంట్రాక్టర్ కు సూచించారు. మంగళవారం ఆర్డీఓ స్థానిక తహశీల్దార్ అల్లం మహేందర్ కుమార్ తో కలసి పెండింగ్ లో ఉన్న నత్త నడకన కొనసాగుతున్న డ్రైనేజీ పైప్ లైన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ … విద్యుత్, డ్రైనేజీ, త్రాగునీటి సరఫరా పైపు లైన్, ప్లంబింగ్ , సీసీ రోడ్డు తదితర పనులను నాణ్యతతో వేగవంతంగా పనులు పూర్తి చేయాలని సదరు కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మన్నె ప్రభాకర్ వెంట, తహశీల్దార్ అల్లం మహేందర్ కుమార్, వర్కర్లు , తదితరులు ఉన్నారు.

You may also like

Leave a Comment