Home తాజా వార్తలు దోమల నివారణకు ప్రత్యేక చర్యలు – గ్రామపంచాయతీ ఈవో పవన్

దోమల నివారణకు ప్రత్యేక చర్యలు – గ్రామపంచాయతీ ఈవో పవన్

by Telangana Express

ముధోల్. ఆగస్టు02(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
వర్షాకాల దృష్ట్యా దోమల నివారణకై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు గ్రామపంచాయతీ ఈవో పవన్ అన్నారు. గ్రామపంచాయతీ ఆధ్వ ర్యంలో గ్రామంలోని అన్ని కాలనీల్లో గల మురుగునీటి కాల్వల్లో దోమల నివారణ మందును పిచికారి చేయిస్తూ, నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారం రోజుల క్రితం వరకు భారీ వర్షాలు కురియడం, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె వల్ల గ్రామాల్లో ఎక్కడిచెత్త అక్కడే పేరుకుపోవడం జరిగిందన్నా రు.పారిశుద్ధ్య నిర్వాహణపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. అయితే మురుగునీటి కాల్వలను శుభ్రం చేయించి నీటి నిల్వలు లేకుండా పటీష్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ, దోమల నివారణకై ముందస్తు చర్యల్లో భాగంగానే ఆయా వార్డు లో దోమల మందును పిచికారి చేయిస్తున్నామని వెల్లడించారు.

You may also like

Leave a Comment