Home తాజా వార్తలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

by Telangana Express

జుక్కల్ డిసెంబర్ 9 :-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.పార్టీ కార్యాలయంలో నాయకులు ,కార్యకర్తలు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు.పటాకులు పేల్చి సోనియమ్మ జిందాబాద్,కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నినదించారు.అనంతరం ప్రాథమిక,జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు,అరటి పండ్లు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి,చిప్ప మోహన్,నాగిరెడ్డి, అక్కలి సాయి రెడ్డి,మల్లప్పపటేల్, శ్యామప్ప, బస్వరాజ్ దేశాయ్,డాక్టర్ సంజీవ్,మారుతి,శ్రీను,రషీద్ ఫిరోజ్,గణపతి,అహ్మద్,హాన్మాండ్లు,పండరి,మాష్ణాజి,బచ్చన్ తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment