ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు
పద్మశాలీల సంక్షేమం, అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటుపై పద్మశాలీలు హర్షం వ్యక్తం చేశారు. మిర్యాలగూడ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సామాజికవేత్త మారం శ్రీనివాస్, పట్టణ పద్మశాలి అధ్యక్షులు జెల్లా రాంబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి రామా రాంప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఉన్న కార్పొరేషన్లు కేవలం చేనేత ఆధారంగా ఉన్న పద్మశాలి, చేనేత కుటుంబాలకి మాత్రమే అందుబాటులో ఉండేవి. పద్మశాలి జనాభాలో అత్యధిక శాతం వృత్తి వెలువల ఉన్నారు. వారి సంక్షేమం అభివృద్ధి కోసం పలు చర్యలు తీసుకోవలసిందిగా గత ప్రభుత్వాలను అభ్యర్థిస్తూ వచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం వృత్తి వెలుపల ఉన్న పద్మశాలీల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కొరకు పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయం. ఈ కార్పొరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుమారు 40 లక్షల మంది పద్మశాలీలకు ఒక భరోసాగా పని చేస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాము. పద్మశాలి కార్పొరేషన్ పద్మశాలి కుల బంధువులకి, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తూ పద్మశాలి సమాజంలో అత్యంత వెనుకబడిన వారికి ఇండ్లు, చిన్నచిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి సబ్సిడీ లోన్లు, పద్మశాలి చేనేత కుటుంబాలకు 500 యూనిట్ల సబ్సిడీ కరెంటు ఉచిత కల్పించాలని పద్మశాలి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవాలని ఆశిస్తూ పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సహకరించిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, మాజీ విప్ ఈరవత్రి కుమార్ లకు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ పట్టణ మాజి ప్రధాన కార్యదర్శి జెల్లా బిక్షం, పట్టణ కోశాధికారి మసరం కృష్ణమూర్తి, తీరందాస్ విష్ణు, రావిరాల నాగేందర్, ముషం నరసింహ ప్రసాద్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.