( చింతల నీలకంఠం. సంపాదకులు.. ముదిరాజ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు)

ముఖ్యమైన పాయింట్స్:కులం కోసం మాట్లాడటం తప్పు కాదు... ఐక్యతే అసలైన బలం!యాదవుల సదర్ సమ్మేళనం ముదిరాజులకు ఒక గుణపాఠం కావాలితెలంగాణ ముదిరాజ్ సమాజం ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి... తెలంగాణలో కుల సంఘాల సభలు కేవలం సమావేశాలు కావు. అవి ఆయా సామాజిక వర్గాల ఆత్మగౌరవానికి, ఐక్యతకు, రాజకీయ చైతన్యానికి ప్రతిబింబాలు. బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద జరిగిన యాదవుల సదర్ సమ్మేళనం మరోసారి ఈ విషయాన్ని నిరూపించింది. ఆ సభ ముదిరాజ్ సమాజం కూడా ఆలోచించాల్సిన అనేక ప్రశ్నలను ముందుకు తెచ్చింది. యాదవ నాయకులు ఆ సభలో తమ కుల సమస్యలనే ప్రధానంగా ప్రస్తావించారు. తమ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. తమ హక్కులు,...