తేజస్వి యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఐఐపీ నేతలు
హైదరాబాద్, నవంబర్ 4:-(తెలంగాణ ఎక్స్‌ప్రెస్ బ్యూరో) ఆర్జేడీ పార్టీ అధ్యక్షుడు తేజస్వి యాదవ్‌ను హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో ఐఐపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి ప్రభాకర్ ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల నీలకంఠం ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున శాలువాతో సత్కరించారు. ఇండియా కూటమిలో భాగంగా తెలంగాణలో పార్టీ పరిస్థితులు, విస్తరణ కార్యక్రమాలపై తేజస్వి యాదవ్‌తో చర్చించారు. దేశవ్యాప్తంగా ఐఐపీ పార్టీని విస్తరించేందుకు ఐపీ గుప్తా ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు వివరించారు. దీనిపై తేజస్వి యాదవ్ సానుకూలంగా స్పందిస్తూ, పార్టీ నాయకులు మరింత ఉత్సాహంతో పనిచేయాలని సూచించినట్లు వారు తెలిపారు.