అక్షర యోధుడికి అరుదైన గౌరవం: సీనియర్ జర్నలిస్ట్ ధన్నారపు రాజలింగానికి గౌరవ డాక్టరేట్ పాతికేళ్ల నిబద్ధత.. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం ఢిల్లీలో అవార్డుతో సత్కరించిన మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్
కామారెడ్డి, తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి 11అక్టోబర్ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సర్వత్రా హర్షాతిరేకాలు నిజాయితీతో కూడిన పాత్రికేయ ప్రస్థానానికి, రాజీ లేని ప్రజాపక్ష పోరాటానికి జాతీయ స్థాయిలో సముచిత గుర్తింపు దక్కింది.సమాజ హితమే శ్వాసగా, అట్టడుగు వర్గాల గొంతుకగా వార్తా కథనాలను అల్లే కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ధన్నారపు రాజలింగం ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. పాతికేళ్ల నిరంతర కలం కవాతు జర్నలిజం రంగాన్ని కేవలం ఒక వృత్తిగా కాకుండా, సామాజిక బాధ్యతగా స్వీకరించిన రాజలింగం గత 25 సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో...