------------------ సిద్దిపేట జిల్లా ఏర్పాటు! అభివృద్ధికి తొడ్పాటు!!. . జిల్లాలో త్రాగు, సాగునీరు.. వైద్య, విద్యారంగాల్లో అభివృద్ధితో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా kcr హరీష్ రావులు నిలిచారు.. . చిన్నకోడూరు మండలానికి రైలు రవాణా కల సాకారం కావడం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ చిన్నకోడూరు: అక్టోబర్ 11 సిద్దిపేట జిల్లా ఏర్పాటు కలను సాకారం చేసి, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుల చిత్రపటాలకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించాయి. . సిద్దిపేట జిల్లా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాముని శ్రీనివాస్ మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని పేర్కొన్నారు....