ఆమనగల్లు, మే 14
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఆమనగల్లు ప్రెస్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా ఆమనగల్లు పట్టణానికి చెందిన సీనియర్ రిపోర్టర్ షేక్ హమీద్ ( ప్రజాతంత్ర) ఏకగ్రీవంగా మంగళవారం ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ వివరాలను ఆయన ప్రకటించారు. గౌరవ అధ్యక్షులుగా సిహెచ్. వెంకటేశ్వర్లు (ఈనాడు) ప్రధాన కార్యదర్శిగా బోడ నరేష్ (దిశ) సహాయ కార్యదర్శిగా ఎర్ర శ్రీనివాస్ రెడ్డి (వెలుగు) ఉపాధ్యక్షులుగా జంతుక యాదయ్య (నమస్తే తెలంగాణ) కోశాధికారిగా ఎంఏ. అజీమ్ (విశాలాంధ్ర) సభ్యులుగా కోరే. రవి (తెలంగాణ ఎక్స్ ప్రెస్) మీర్జా. ఇమ్రాన్ బేగ్ (మన సాక్షి) లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు హమీద్ మాట్లాడుతూ ఆమనగల్లు విలేకరులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా హమీద్ ను పలువురు సన్మానించి అభినందనలు తెలిపారు.