మిర్యాలగూడ డిసెంబర్ 7 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మిర్యాలగూడ పట్టణంలోని 43, 28 వార్డులో మధ్యలో సరి హద్దులో ఉన్న ఉస్మానియా మసీద్ కి వెళ్లే రోడ్డు గుంతలు మారి ఎన్నో ఏళ్లుగా స్థానిక వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడినప్పుడు గుంతలో నీరు చేరి రాకపోకులకు తీవ్ర ఆటంకం కలుగుతుంది.
దీన్ని దృష్టిలో ఉంచుకొని 43 వ వార్డు కు చెందిన సిపిఎం నాయకులు, సీనియర్ జర్నలిస్టు మహమ్మద్ ఆయూబ్ తన సొంత ఖర్చులతో గుంతలగా మారిన రోడ్డును శనివారం మరమ్మతులు చేయించారు.
తనే స్వయంగా గుంతలను పూడ్చి వేశారు. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న అధికారులు పాలకులు పట్టించుకోకపోవడంతో సొంత ఖర్చులతో ఆయూబ్ రోడ్లు మరమ్మతు చేయడం పట్ల స్థానిక వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.