చేగుంట నవంబర్ 27 తెలంగాణ ఎక్స్ ప్రెస్
చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలోని మహిళా రైతులకు సెహగల్ ఫౌండేషన్ మరియు హైటెక్ సీడ్ కంపెనీ వారు వరి మరియు మొక్కజొన్న విత్తనాలను, పురుగు మందులను మరియు కలుపు మందులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా ప్రోగ్రామ్ లీడ్ వాణి మాట్లాడుతూ సరైన సమయంలో విత్తనాల్ని నాటాలని, కలుపు మందులు వాడాలని, తద్వారా అధిక దిగుబడులను సాధించ వచ్చని తెలియజేసారు. ఇప్పటికే చేగుంట మండలంలోని దత్తత తీసుకున్న పది గ్రామాలలో, విత్తన పంపిణి కార్యక్రమం సక్రమంగా నిర్వహించామని చెప్పారు. మహిళా రైతుల అభివృద్ధికై ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తుందని తెలియజేసారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వారు ఫీల్డ్ అసిస్టెంట్స్ విజయ్, శ్రావణ్.