ఇంటింటి బీఆర్ఎస్ ప్రచారంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామోజీ రజిత కృష్ణమాచారి
చిగురుమామిడి నవంబర్ 21
( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒడితెల సతీష్ కుమార్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని హుస్నాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ రామోజు రజిత కృష్ణమాచారి సుందరగిరి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని మండలాలతో పాటు మన చిగురుమామిడి మండలంలో కుడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నాయకుడు సతీష్ కుమార్ అని మూడవసారి కుడా మళ్ళీ ఎమ్మెల్యే గా గెలిపించుకొని మన గ్రామంతోపాటు మండలాన్ని మరింత అభివృద్ధిపదంలో తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యేగా సతీష్ కుమార్ గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు , ప్రతి ఇంటికి ఏదో రకంగా లబ్ధి చేకురిందంటే రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నందువలనే అని గుర్తుంచుకోవాలన్నారు అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్ దే అని అన్నారు,సతీష్ కుమార్ ని భారీ మెజార్టీ తో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాళ్లు, కేక్కెర్ల లక్ష్మి, వెంకట లక్ష్మి. మహిళలు తదితరులు పాల్గొన్నారు.