అర్హులందరూ అప్లై చేసుకోగలరు..
18వ వార్డ్ కౌన్సిలర్ రామారం శ్రీహరి గౌడ్..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర దమ్మాయిగూడ ఫిబ్రవరి 10:(తెలంగాణ ఎక్స్ ప్రెస్): దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఓల్డ్ విలేజ్ హనుమాన్ టెంపుల్ వద్ద 18వ వార్డు లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన గృహ జ్యోతి పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరి నుండి దరఖాస్తు తీసుకుని పత్రాల ను పరిశీలించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ రామారావు శ్రీహరి గౌడ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ పత్రాలను సమర్పించి ఈ గృహ జ్యోతి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్,ప్రజా పాలన దరఖాస్తు రసీదు మరియు ఎలక్ట్రిక్ సిటీ బిల్లు రసీదు లను జత పరిచి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సమక్షంలో ఈ దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. ఈ పథకంలో 200యూనిట్ల విద్యుత్ ను అర్హులందరూ ఉచితంగా పొందవచ్చునని 18వ వార్డ్ కౌన్సిలర్ రామారం శ్రీహరి గౌడ్ ప్రజలకు తెలియజేశారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అమలు జరిగే విధంగా, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటికి నెర వేరుస్తారని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
