Home తాజా వార్తలు బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి

బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి

by Telangana Express

మంచిర్యాల, మార్చ్ 10, (తెలంగాణ సెక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా, మందమరి పట్టణ బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పద్మశాలిభవంలో సావిత్రిబాయి పూలే 127 వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం మందమర్రి పట్టణ బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వి హెచ్ పి ఎస్ జాతీయ నాయకుడు పెద్దపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ
సావిత్రిబాయి పూలే 1831 జనవరి 03 జన్మించి 1897 మార్చి 10న పరమావధించారు. సావిత్రిబాయి పూలే సంఘసంస్కర్త ఉపాధ్యాయుని కవయిత్రి సంబ్బాడ వర్గాలకు, మహిళ అభ్యున్నతికి కృషి చేసిన సంఘ సంస్కర్త. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిని, ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన సావిత్రిబాయి భర్త పూలే తో కలిసి 1848 జనవరి 1న మొట్టమొదటిసారి బాలికల పాఠశాల ప్రారంభించింది. మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయడం సావిత్రిబాయి పూలే సామాజిక బాధ్యతగా నిర్వహించారు సావిత్రిబాయి పూలేను స్ఫూర్తి తీసుకొని నేటి సమాజంలో యువకులు మహిళలు ముందుకు నడవాలని, సావిత్రిబాయి పూలే గారి ఆశయాన్ని ముందు తీసుకెళ్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు, చిలగాని సుదర్శన్, మడిపెళ్లి వెంకటేశ్వర గౌడ్, గాదాసు శంకరయ్య, సామల సత్యనారాయణ, గాజుల ప్రతాప్, వెల్ది ప్రభాకర్, బండారి రాజేశం, ఉడుత చంద్రమౌళి, మండ భాస్కర్, బుర్ర రాజు, గుడిమెట్ శ్రీనివాస్, రామటంకి దుర్గారాజ్, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment