ఎస్పీ సింధు శర్మ
(తెలంగాణ ఎక్స్ప్రెస్) ఎండి 13 ఫిబ్రవరి 2024
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను నెరవేర్చడానికి ప్రతి గౌడ బిడ్డ కృషి చేయాలని ఎస్పీ సింధు శర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం జై గౌడ ఉద్యమం క్యాలెండర్ ఆవిష్కరించి మాట్లాడారు. గోల్కొండ కోటను ఏలిన మహావీరుడని ఆయన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రంగోల్ల మురళి గౌడ్, అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్, ఇందూరి సిద్ధ గౌడ్, తాటిపాముల బాబాగౌడ్, కాసాల శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు