స్వపరిపాలనపాలన దినోత్సవ విద్యాశాఖ మంత్రి
మిర్యాలగూడ డివిజన్ మార్చి 23 తెలంగాణ ఎక్స్ ప్రెస్/ పట్టణంలోని బంగారుగడ్డలో గల కైరళి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించామని పాఠశాల కరస్పాండెంట్ అహ్మద్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలోని సుమారు 40 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా అధికారుల పాత్రల్లో చేశారన్నారు. విద్యాశాఖ మంత్రి, హోమ్ మినిస్టర్, ఎస్పీ, కలెక్టర్, ఎమ్మెల్యే, డీఈవో, ఎంఈఓ, కరస్పాండెంట్, ప్రధానోపాధ్యాయులు గా వారి పాత్రలో వారి విధులను చక్కగా నిర్వర్తించారన్నారు. అలాగే కొంతమంది విద్యార్థినులు ఉపాధ్యాయులుగా వారి విధులను సక్రమంగా నిర్వర్తించారన్నారు. ఈ విధంగా చేయడం వలన విద్యార్థులకు కూడా ఉపాధ్యాయులు అంటే గౌరవం పెరుగుతుందని, సమాజంలో ఉపాధ్యాయుల యొక్క విలువ తెలుస్తుంది అన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లందరికీ కూడా బహుమతులు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు వరలక్ష్మి, రాజేష్, అశోక్, రేణుక, మంజుల, రేష్మ, విజయలక్ష్మి, ఝాన్సీ, మమత రహీం ఉందిసా సభియ, రమాదేవి, సంధ్య, మానస, సరిత, సల్మా, పద్మ, ఝాన్సీ, జకియ, నవీన, ఇస్రత్ తదితరులు పాల్గొన్నారు.