అమ్మవారి ఆశీర్వాదానికి కదిలిన మహిళలు…
సారలమ్మ ఆగమనంలో పాల్గొన్న ధర్మకర్త, యుఫ్ టీవీ సీఈవో ఉదయ్ రెడ్డి..
వీణవంక, ఫిబ్రవరి 21( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం లోని చల్లూరు, పోతిరెడ్డిపల్లి, కోర్కల్, వీణవంక గ్రామాలలో బుధవారం సాయంత్రం సారలమ్మ ఆగమనం ఆయా గ్రామాల ప్రజలతో అంగరంగ వైభవంగా, కోయ పూజారులతో , డప్పు చప్పుల మధ్య, శివ సత్తుల పూనకాలతో సారాలమ్మ వనం నుండి గద్దెకు చేరుకుంది. మినీ మేడారంగా ప్రసిద్ధిగాంచిన , వీణవంక లో జరుగుతున్న సమ్మక్క- సారలమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమై గ్రామ పురవీధుల గుండా కోయ పూజారులతో ప్రారంభమై, గొల్ల, కురుమల ఒగ్గుడోల్ల వాయిద్యాల మధ్య, డప్పు చప్పుల మధ్య, శివసత్తుల పూనకాల మధ్య , గ్రామ ప్రజల మంగళ హారతులతో, సారలమ్మను ఆలింగనం చేసుకుంటూ, అమ్మవారికి ఎదురుగా బిందెలతో నీరు ఆరగిస్తూ, అమ్మవారి బొట్టును ధరిస్తూ, గ్రామ ప్రజలు చిన్న పెద్ద కలిసి చిందులు వేస్తూ, ప్రతి రెండు ఎండ్లకు ఒకసారి జరిగే జాతరను, గ్రామంలో ప్రజలందరూ కులమతాలకు అతీతంగా కలిసిపోయి, సోదర భావంతో, భక్తి భావంతో రెండు రోజులు జరిగే ఉత్సవంలో సంతోషంగా పాల్గొంటూ, జాతర కమిటీలో వాలంటరీగా భక్తులకు సహా సహకారాలు అందిస్తూ , వీణవంక గ్రామ ప్రజలు భక్తులకు సాదర స్వాగతం పలుకుతూ, సమ్మక్క సారలమ్మ అనుగ్రహ, ఆశీర్వచనం అందుకుంటున్నారు.

సారలమ్మ ఆగమనంలో యుఫ్ టీవీ సీఈవో పాడి ఉదయ నందన్ రెడ్డి పాల్గొనగా గ్రామ ప్రజల సంతోషానికి అవధులు లేవు..

చిన్న పెద్దతో కలిసి సరదాగా గడుపుతూ, సారాలమ్మ ఆగమనంలో గ్రామస్తులతో సరదాగా గడిపారు. ఈ మహోత్సవంలో ఆయా గ్రామాల్లో కమిటీ చైర్మన్లు పాల్గొనగా, వీణవంక సారలమ్మ ఆగమనంలో ధర్మకర్త, యుఫ్ టీవీ సీఈవో పాడి ఉదయ నందన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి ప్రభాకర్, మాజీ సర్పంచులు ఐలయ్య, రఘుపాల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అతిధి డెవలపర్స్ అధినేత కొమ్మిడి రాకేష్ రెడ్డి,సతీష్ కుమార్ యాదవ్,అమృత ప్రభాకర్, ఎండి హమీద్, మాజీ ప్రజా ప్రతినిధులు, భక్తులు,గ్రామ ప్రజలు,మహిళలు, కోయ పూజారులు తదితరులు పాల్గొన్నారు.