వేములపల్లి, జులై 26( తెలంగాణ ఎక్స్ ప్రెస్): నల్గొండ జిల్లా వ్యాప్తంగా విద్యార్థి ఫెడరేషన్ నిర్వహిస్తున్న సంఘర్షణ సైకిల్ యాత్ర బుధవారం వేములపల్లి మండల కేంద్రానికి చేరుకుంది ఈ సందర్భంగా ప్రజా సంఘ నాయకులు సంఘీభావం తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాదూరి గోవర్ధన మాట్లాడుతూ ప్రభుత్వ బడులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తున్న సంఘర్షణ సైకిల్ యాత్ర బృందం దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ జిల్లా కలెక్టర్ పరిశీలించలని వేములపల్లి మండల కేంద్రంలో ఉన్న సమస్యల గురించి ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుండా నిధులను పక్కదారి పట్టిస్తున్న అధికారులను విద్యార్థులకు అందించే విధంగా సూచించాలని లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు, ఈ సంఘర్షణ సైకిల్ యాత్రలో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, కంభంపాటి శంకర్, సైదా నాయక్, లక్ష్మణ్ నాయక్, వెంకటేష్ ,రమేష్, జగన్, వీరన్న, సంపత్, సాయి చందు, నవదీపు లకు వేములపల్లి ఎంపిటిసి చల్లగొట్ల చైతన్య సిఐటియు జిల్లా నాయకులు రొండి శ్రీనివాస్, డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పతాని శ్రీను, నాయకులు రేనయ్య, తదితరులు స్వాగతం పలికి మండలంలోని సమస్యలను వివరించారు.
వేములపల్లి కి చేరుకున్న సంఘర్షణ సైకిల్ యాత్ర
71
previous post