మంచిర్యాల, నవంబర్ 14, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం విశ్వబ్రాహ్మణ సంఘాన్ని నూతనంగా ఎన్నుకొని ఆ సంఘాన్ని మార్పు చేశారు. మంగళవారం జన్నారం మండలం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా మరో ఇద్దరు సభ్యులను ఆ సంఘంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులుగా కొత్తపల్లి అశోక్ చారి, మండల అధికార ప్రతినిధిగా దేవరకొండ నరేష్ చారి లను ఆ కమిటీ సభ్యులు నియమించుకున్నారు. ఈ మండల విశ్వబ్రాహ్మణ ఎన్నికలు అధ్యక్ష, కమిటీ కార్యవర్గం సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, ఆ కమిటీ సభ్యులు అన్నారు. జన్నారం మండల విశ్వబ్రాహ్మణ నూతన కమిటీ సభ్యులను శాలువాతో ఆ సంఘం అధ్యక్షుడు కాడర్ల నరసయ్య సన్మానించారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల విశ్వబ్రాహ్మణ అధ్యక్షుడు కాడర్ల నరసయ్య, ఉపాధ్యక్షుడు భామండ్ల పెళ్లి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి నర్సింగోజు శ్రీనివాస్, కోశాధికారి కొత్త శ్రీను, దొనోజు శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి వేము నూరి శేఖర్, మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
మండల విశ్వబ్రాహ్మణ సంఘాన్ని మార్పు చేసిన సంఘా నాయకులు
52